- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి వెలుగుకు కొత్త చిక్కులు
దిశ, వైరా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకానికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కంటి వెలుగు పథకాన్ని నిర్వహించేందుకు ఖమ్మం జిల్లాలో అద్దెకు తీసుకున్న కార్లకు నేటి వరకు బిల్లులు చెల్లించలేదు. రెండు నెలలైనా తమకు బిల్లులు రాకపోవడంతో కార్ల యజమానులు కంటి వెలుగు పథకం కింద తమ వాహనాలను తిప్పలేమని చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో కంటి వెలుగు పథకం కింద 55 బృందాలు పనిచేస్తున్నాయి.
ఒక్కో బృందంలో ఒక ఆప్ట్రో మెట్రిస్ట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి ఆటో రిఫ్రాక్టివ్ మీటర్ కేటాయించారు. అయితే గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు కంటి పరీక్షలు చేసేందుకు ఒక్కో వైద్య బృందానికి ఒక అద్దె కారును ప్రభుత్వం కేటాయించింది. కంటి వెలుగు ప్రారంభమైన జనవరి 18వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు రెండు నెలలు దాటినా కార్ల అద్దె బిల్లులు మంజూరు కాలేదు. ఆప్ట్రో మెట్రిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను 2022 డిసెంబర్ నెల 20వ తేదీ నుంచి విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఈ సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతం ఇంకా చెల్లించలేదు.
వైద్య సిబ్బంది, కార్ల అద్దెకు నెలవారీ ఎంత చెల్లించాలంటే....
ఖమ్మం జిల్లాలో కంటి వెలుగు కింద 55 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో ఆప్ట్రో మెట్రిస్ట్‌కు నెలకు రూ.30వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.20 వేలు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కారుకు నెలకు రూ.33 వేల చొప్పున అద్దె బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. జిల్లాలో కంటి వెలుగు కేంద్రాలకు ప్రభుత్వం దగ్గర సరిపడా ఇండెంట్ లేకపోవడంతో 12 ఆటో రిఫ్రాక్టివ్ మీటర్లను(కళ్ళను పరీక్షించే యంత్రాలు) నెలకు రూ.25 వేలు చెల్లించే విధంగా అద్దెకు తీసుకున్నారు. అయితే ఈ లెక్కల ప్రకారం రెండు నెలలు దాటినా కార్ల అద్దె బిల్లులు చెల్లించలేదు.
కారు అద్దెకు పెట్టిన యజమానులు రూ.33 వేల అద్దె రుసుములోనే డ్రైవర్ జీతంతో పాటు నెలకు సరిపడా డీజిల్ పోయించాల్సి ఉంటుంది. అయితే రెండు నెలలుగా బిల్లులు మంజూరు కాకపోవటంతో కారు యజమానులు డ్రైవర్లకు జీతాలు ఇవ్వకపోగా డీజిల్ పోయించేందుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్ల యజమానులు కంటి వెలుగు పథకం కింద తమ కార్లను అద్దెకు తిప్పలేమని చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆప్ట్రోమెట్రిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఫిబ్రవరి నెల జీతం మార్చి నెల ముగుస్తున్నా నేటి వరకు చెల్లించలేదు.
అంతేకాకుండా ఆటో రిఫ్రాక్టివ్ మీటర్ కు సంబంధించిన అద్దె జనవరి 18 నుంచి నేటి వరకు చెల్లింపులు జరగలేదు. దీంతో కంటి వెలుగులో పని చేసే సిబ్బంది జీతాలు రాక, కార్లకు అద్దెలు చెల్లింపు జరగక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే సిబ్బందికి జీతాలు, కార్ల అద్దె చెల్లింపులు చేపట్టాలని కంటి వెలుగు పథకంలో పనిచేస్తున్న సిబ్బంది కోరుతున్నారు.
ఖజానా కార్యాలయంలో బిల్లును అప్పగించాం
మాలతి, జిల్లా వైద్యాధికారిణి
కంటి వెలుగు కార్ల అద్దె చెల్లింపు, సిబ్బంది జీతాలు పెండింగ్లో ఉన్న విషయం వాస్తవమే. సిబ్బంది జీతాలు, కార్లకు సంబంధించిన బిల్లుల చెక్కును ఇప్పటికే ఖజానా కార్యాలయంలో అప్పగించాం. ఖజానా కార్యాలయంలో ఈ బిల్లులు పాస్ కూడా అయ్యాయి. ఈ కుబేర్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది.
- Tags
- wyra
- kantivelugu