Sridhar Babu : తెలంగాణలో లే ఔట్ల అనుమతులకు నూతన విధానం : మంత్రి శ్రీధర్ బాబు

by M.Rajitha |
Sridhar Babu : తెలంగాణలో లే ఔట్ల అనుమతులకు నూతన విధానం : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ మరో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇకపై భవనాలకు, లే ఔట్ల అనుమతులకు కొత్త ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. 'బిల్డ్ నౌ'(Build Now) పేరుతో తెచ్చిన ఈ నూతన విధానాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నేడు ప్రారంభించారు. తెలంగాణలో 60 శాతం మంది జనాభా పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తున్నందున.. భవన నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి పెట్టరాని మంత్రి శ్రీధర్ బాబు తెలియ జేశారు. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే.. ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్(Hyderabad) టాప్ లో ఉందన్న మంత్రి.. ఇక్కడ నివసించే ప్రజలే అధికంగా గృహ నిర్మాణాలు చేపడుతూ.. గృహ రుణాలు ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story