మెట్రో సెకండ్ ఫేజ్‌కు కొత్త లోగో!

by samatah |   ( Updated:2023-01-27 10:55:29.0  )
మెట్రో సెకండ్ ఫేజ్‌కు కొత్త లోగో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో సేవలను రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండో దశలో కొనసాగనున్న విస్తరణ ప్రాజెక్ట్ కు కొత్త పేరు అందుకు సంబంధించిన లోగోను విడుదల చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)తో కొనసాగుతుండగా రెండో దశ పనులకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) పేరుతో లోగోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

త్వరలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ జిసి కోసం బిడ్‌లలో పాల్గొనడానికి అర్హత సాధించడానికి కాబోయే ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలతో ప్రీ-అప్లికేషన్ మీటింగ్ ఉండబోతోందని తెలిపారు. కాగా, మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కారిడార్ ను విస్తరించే పనులను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మూడేళ్ల లక్ష్యంతో సుమారు 31 కిలో మీటర్లలో ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.6,250 కోట్లను ఖర్చు చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed