- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీసీఎల్ఏ వెబ్‌సైట్‌లో ముసాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్వోఆర్ బిల్లు 2024 పై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమెయిన్‌లో పెడుతున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్ సైట్ (www.ccla.telangana.gov.in)లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించారు. ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ మెయిల్ ([email protected]) చేయాలి. పోస్ట్ ద్వారా సీసీఎల్ఏ కార్యాలయానికి పంపించవచ్చు. చిరునామా; ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001.