- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
National Farmer's Day : అన్నం పెట్టే రైతన్నకు ఎన్ని కష్టాలో..
ఏ వ్యక్తిని చూస్తే మట్టి పులకరిస్తుందో..
ఏ వ్యక్తిని చూస్తే వరిసేలు హొయలు పోతాయో..
ఏ వ్యక్తిని చూస్తే.. బీడు భూమి సైతం చిందేస్తుందో ఆ వ్యక్తే.. అన్న పూర్ణ దేవి ముద్దుబిడ్డ రైతు.
తాను పడుతున్న కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా, స్వార్థం లేకుండా మనకు అన్నం పెట్టే వ్యక్తి రైతు. సూర్యోదయం కాగానే, తాను నమ్ముకున్న పంటను పలకరించి వచ్చి సద్దిమూట కట్టుకొని పొద్దు గూట్లో పడే వరకు ఆయన తన రోజు మొత్తాన్ని మట్టితోనే గడుపుతాడు. మనం ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నాంటే దానికి కారణం కూడా రైతే. రైతు లేకపోతే ఈరోజు ఎవరూ లేరు అనేది వాస్తవం. అలాంటి రైతుకు నేడు రైతు దినోత్సవం శుభాకాంక్షలు. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం.
దిశ, వెబ్‌డెస్క్: రైతు లేనిదే మనిషే లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటి వాడు అంటారు. కానీ నేడు ఆ రైతే ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు. అతి వృష్టి, అనావృష్టితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట సరిగా పండగా, పండిన పంటకు గిట్టుబాట రాక రైతు ఎన్నో బాధలు పడుతున్నారు. అంతే కాకుండా నకిలీ విత్తనాలు, నకిలీ మందులతో రైతులు చాలా నష్టపోతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకుంటూ అప్పులు చేస్తూ.. వాటిని తీర్చలేక ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇకకొంత మంది వ్యవసాయం చేస్తూ.. ఆ బాధలు తమ పిల్లలు భరించ కూడదని, వారిని గొప్ప గొప్ప చదువు చదివిపించి వ్యవసాయానికి దూరంగా ఉంచుతున్నారు. దీంతో వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇలా కాకుండా రైతు రాజుగా ఉండాలంటే పంటకు గిట్టుబాటు ధర కల్పించి, ఎలాంటి నకిలీ మందులు మార్కెట్‌లోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
రైతు దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5వ ప్రధాన మంత్రి. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందరీ చట్టం రద్దు అయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశ పెట్టడం జరిగింది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్‌సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. తర్వాత చరణ్ సింగ్ రైతునాయకుడిగానే 1987 మే 29 న మరణించారు. రైతులకు ఆయనచేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని కిసాన్ దివస్ " గా ప్రకటించింది. దీంతో డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం.
READ MORE
మీరు రోజు రెండు లేక మూడు లవంగాలను తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే !