తుంగతుర్తిలో జోనల్ స్పోర్ట్స్ మీట్..

by Vinod kumar |   ( Updated:2023-10-05 14:32:51.0  )
తుంగతుర్తిలో జోనల్ స్పోర్ట్స్ మీట్..
X

దిశ, తుంగతుర్తి: జోనల్ స్పోర్ట్స్ మీట్‌కు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల వేదిక అయింది. పాఠశాల ఏర్పడ్డ రెండు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా జరిగే ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఈనెల 13 నుండి 16 వరకు 4 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో వివిధ జిల్లాలైన జనగాం నుండి 3, యాదాద్రి భువనగిరి నుండి 5, సూర్యాపేట నుండి 2 చొప్పున మొత్తంగా 9 పాఠశాలలకు చెందిన 800 మంది బాలికలు 11 రకాలకు చెందిన క్రీడలు, ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌లలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ వైబి. శ్యామలత గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

పాఠశాల ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ జరగనుందని తెలిపారు. ఇందులో కబడ్డీ, కోకో, క్యారం, చెస్, షాట్ ఫుట్, టెన్ని కాయిట్, లాంగ్ జంప్ తోపాటు వివిధ రకాల క్రీడలు, ప్రత్యేకంగా వివిధ స్థాయిల్లో అథ్లెటిక్స్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానిక మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డితో పాటు జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు హాజరవుతారని తెలిపారు.

Advertisement

Next Story