- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే
దిశ,నల్లగొండ : మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ సమావేశానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ,దేశవ్యాప్తంగా యువతను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని, వాటి బారి నుండి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసన మండలి చైర్మన్ తెలిపారు. ఒక్కసారి మత్తు పదార్థాలకు ఆలవాటు పడితే బయటకు రావడం కష్టమని ,అందువలన యువత ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే వయసులో ఏ రంగంలో ప్రతిభ చాటవచ్చో గుర్తించి ఆలోచించి అటువైపు ప్రయాణించాలని సూచించారు.
జీవితంలో ఏది సాధించాలన్నా కృషి ,పట్టుదల అవసరమని, కష్టపడే ఆలోచన విధానం పై దృష్టి పెట్టాలని, మంచివారితో స్నేహం చేయాలని, చెడు వ్యసనాలకు ఎవరూ బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఎలాంటి మత్తు పదార్థాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. రెండవ బహుళ జోన్ ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అన్ని దుష్పరిణామాలే అని ,యువత మంచిని కోరుకునే వైపు వెళ్లాలని సూచించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ, సమాజంలో తల్లిదండ్రులు, అందరూ సహకరించినప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదువుకునే సమయంలో విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాలో గంజాయి వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గంజాయితో పాటు, మత్తుమందుల నివారణలో భాగంగా పోలీస్ యంత్రాంగం ద్వారా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనా రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు, నాయక్ , ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, డీఎస్పీలు శివరాం రెడ్డి, గిరిబాబు, సీఐ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాదక ద్రవ్యాల పై ప్రతిజ్ఞ చేయించారు.