- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అవునా మోడీ ఇస్తున్నాడా... సన్న బియ్యం రసీదు చక్కర్లు
by Aamani |

X
దిశ, రాజాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపులలో సన్నబియ్యం పథకం ఆర్భాటంగా ప్రారంభమైంది. అయితే మంగళవారం రేషన్ షాప్ లో ఒకతను 18 కిలోల సన్నబియ్యం తీసుకోగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన రసీదు వచ్చింది. అందులో మొత్తం కేటాయింపు 18, కేంద్రం కేటాయింపు 15, కేంద్ర ఆర్థిక వ్యయం37.52, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ 562.8, రాష్ట్ర కేటాయింపు 3, రాష్ట్ర ఆర్థిక వ్యయం 42.01, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ 126.03, ఇతరత్రా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తం 149.58 సబ్సిడీ రసీదు మీద ప్రింట్ అయి ఉన్నది. ఇదే రసీదు ఉదయం నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సన్న బియ్యం లో మోడీ వాటా ఉన్నదని బీజేపీ నేతలు రసీదును ఆయుధం చేసుకుని ప్రచారం కొనసాగిస్తున్నారు.
Next Story