- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారెవ్వా..యువకుడు చేసిన పనికి శభాష్ అనాల్సిందే..
by Naveena |
X
దిశ, పెన్ పహాడ్ : మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన రణపంగ శ్రవణ్ పూలే తన అవయవాలను..సూర్యాపేట మెడికల్ కాలేజీకి దానంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కూతురు రణపంగ ఉద్యమ పుట్టిన రోజు సందర్భంగా అవయవ దానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ లోకాన్ని వీడి వెళ్ళినా మనం దానం చేసిన అవయవాలు మాత్రం ఇంకా ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయన్నారు. బతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు..చనిపోయాక కూడా మరి కొంత మందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుందన్నారు. మానవ నిర్మాణంలో ప్రతి అవయవం కీలకమేనని ఎదుటి వారికి మనం చేసే అన్ని దానాల కన్నా అవయవ దానం ఉన్నతమైనదన్నారు. అవయవ దానంపై అపోహలు వీడి..యువత అనేక మంది ముందుకు వచ్చి ఆదర్శంగా నిలవాలిని కోరారు. ఈ సందర్భంగా పలువురు తన స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు తన ఆదర్శాన్ని అభినందించారు.
Advertisement
Next Story