Minister Uttam Kumar Reddy: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తాం..

by Naveena |   ( Updated:2024-11-03 15:22:01.0  )
Minister Uttam Kumar Reddy: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తాం..
X

దిశ ,హుజూర్ నగర్ :గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని ,ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో..ఇండ్లన్నీనిలిచిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy )అన్నారు. ఆ ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణ శివారులోని రామస్వామి గుట్ట వద్ద 2000 పైగత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని ,ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో..ఇండ్లన్నీనిలిచిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.గా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం..చివరి దశలో ఉన్న ఇండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. మంజూరు చేసిన ఇండ్లలో 70 శాతం పనులను పూర్తి చేశామని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇండ్లను నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేసి డంపింగ్ యార్డ్ గా మార్చిందని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఆగి ఉన్న ఇంటి నిర్మాణ పనులను వేగవంతంగా మొదలుపెట్టిందని అన్నారు. అది త్వరలోనే ఇండ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed