- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంధకారంలో గడుపుతున్నాం
దిశ, నడిగూడెం : తమ కాలనీకి విద్యుత్ సరఫరాను కల్పించాలని, అంధకారంలో గడుపుతున్నామని స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గల బుడగజంగాల కాలనీకి గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా కావడం లేదని కాలనీకి చెందిన వారు మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంట్ సౌకర్యం లేక కాలనీలో దోమల బెడద కారణంగా విష జ్వరాల బారిన పడుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఇరువురు విష సర్పాల కాటుకు గురయ్యారని, చీకట్లో భయం భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై జి. అజయ్ కుమార్ ఆందోళన చేస్తున్న వారి సమస్యను తెలుసుకుని విద్యుత్ ఏఈ సైదా దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో నివాసముంటున్న వారి ఇళ్లకు విద్యుత్ మీటర్లు లేవని, విద్యుత్ మీటర్ల కు డీడీలు చెల్లిస్తే వెంటనే సరఫరాను పునరుద్ధరిస్తామని ఏఈ చెప్పడంతో ధర్నా ను విరమించారు. ఈ కార్యక్రమంలో రాములు, ఎలమంద, వెంకన్న, సైదులు, రాజలింగం, చంద్రయ్య, ఆండలమ్మ, ప్రమీల, లచ్చమ్మ పాల్గొన్నారు.
- Tags
- worry