ఎస్సీ వర్గీకరణ చేపట్టండి.. జాతీయ రహదారిపై టైర్లు కాల్చి ఎమ్మార్పీఎస్ నిరసన

by Kalyani |
ఎస్సీ వర్గీకరణ చేపట్టండి.. జాతీయ రహదారిపై టైర్లు కాల్చి ఎమ్మార్పీఎస్ నిరసన
X

దిశ, చౌటుప్పల్: ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రెలగూడెం స్టేజి వద్ద సోమవారం జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహిస్తారనే సమాచారంతో పోలీసులు సోమవారం ఉదయం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా ఎమ్మార్పీఎస్ నాయకులు అనూహ్యంగా బొర్రలగూడెం స్టేజి వద్ద జాతీయ రహదారిపై తమ నిరసనను కొనసాగించారు.

దీంతో కాసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మార్పీఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాట్లాడుతూ.. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ఎస్సీ వర్గీకరణ కోసం తమ ఉద్యమాలను ఆపేది లేదని తెలిపారు. ఎనిమిది ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై మాదిగలను మోసం చేస్తూ వస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని లేదంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నా బీజేపీకీ పగటి కలలుగానే మిగులుతాయని హెచ్చరించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బోయ లింగస్వామి మాదిగ, ఊదరి నరసింహ, బోసి బండారి డేవిడ్, లింగగళ్ళ ఆంజిలయ్య, వనిపాక రాజేష్, బోగుల రాజేష్,బోయ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed