“దిశ” కథనంతో అధికారుల అలర్ట్..

by Sumithra |
“దిశ” కథనంతో అధికారుల అలర్ట్..
X

దిశ, తుంగతుర్తి : శనివారం “దిశ”లో వెలువడిన వార్త కథనంతో జిల్లాతో పాటు నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల వరి ధాన్యం తడిసి ముద్దయిన కథనాన్ని ఫోటోలతో సహా ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు దీనిపై తుంగతుర్తి తహసిల్దార్ రాంప్రసాద్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా “దిశ”తో మాట్లాడారు. జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలలోనే ఎక్కువగా వర్షం కురిసిందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ మేరకు రైతాంగం ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తహసిల్దార్ రాంప్రసాద్, ఏపీఎం నర్సయ్య, ఆర్ఐ రవీందర్, వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారిని స్రవంతి మండలంలోని వివిధ గ్రామాలను పర్యటించి వర్షంతో ఏర్పడ్డ నష్టం వివరాలను సేకరించారు.

వెంపటి, రామన్నగూడెం, కొత్తగూడెం గ్రామాలలో రైతులను ఉద్దేశించి తహసిల్దార్ రాంప్రసాద్ మాట్లాడారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ మేరకు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న పరిణామాలతో రైతాంగం ఈనెల 30 వరకు అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆరపెట్టాలని తెలిపారు. తడిసిన ధాన్యం బస్తాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే ఉద్యానవన శాఖ అధికారిని స్రవంతి తుంగతుర్తి, కరివిరాల గ్రామాలలో పర్యటించారు. తుంగతుర్తి మండలం పరిధిలో 324 ఎకరాల్లో మామిడి తోటలకు కష్టం ఏర్పడినట్లుగా ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

Advertisement

Next Story

Most Viewed