హత్య కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ !

by Sumithra |
హత్య కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ !
X

దిశ, దేవరకొండ : ప్రేమ వ్యవహారంలో బాలిక కుటుంబ సభ్యుల చేతిలో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నల్గొండ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు దేవరకొండ డీఎస్పీ మేక నాగేశ్వరరావు తెలిపారు. శనివారం దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రంపొడు మండలం కొప్పల్ గ్రామంలో గురువారం జరిగిన హత్యకేసు వివరాలను ఆయన తెలిపారు. కట్టంగూరు మండలం దుగ్గినవెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్ (18) నల్లగొండలో ఇంటర్ చదువుతున్న కొప్పోలు గ్రామానికి చెందిన గాయత్రితో గతంలో ప్రేమ వ్యవహారం సాగింది. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీస్ స్టేషన్లో సంతోష్ పై ఫిర్యాదు చేసి, కౌన్సిలింగ్ ఇచ్చారు. తమ పిల్లలు ఒకరి జోలికి కొకరు రాకుండా చూసుకోవాలని గాయత్రి యువకుడి తల్లిదండ్రుల మధ్య పంచాయతీలో అంగీకారం కుదిరింది.

కాగా గురువారం సంతోష్ చండూరు మండలం ఉడుతలపల్లిలో రామాలయ వార్షికోత్సవానికి మేనమామ ఇంటికి వచ్చాడు. అదేరోజు మధ్యాహ్న సమయంలో కొప్పోలు గ్రామంలోని గాయత్రి ఇంటికి సంతోష్ వచ్చి మాట్లాడుతుండగా గాయత్రి తండ్రి ఆవుల మల్లయ్య, ఆవుల నగేష్, నాయనమ్మ ఆవుల రాములమ్మ, కోపొదిక్కులై సంతోష్ ను ఇంట్లో నుండి బయటికి ఈడ్చుకొచ్చి రోకలి బండతో తలపై కాలపై చేతులపై ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో సంతోష్ అక్కడికక్కడే మరణించాడని ప్రాథమిక విచారణ తేలినట్టు డిఎస్పి తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న డీఎస్పీ కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాసులు, ఎస్సై శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి నిందితుల పై హత్య నేరం కింద క్రైమ్ నెంబర్ 68 /2023 యూ/ఎస్ 302 ఆ/34 ఐపీసీ సెక్షన్ కింద కేసునమోదు చేసి నిందితులను నల్గొండ కోర్టులో హాజర్ పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాసులు, గుర్రంపోడు ఎస్సై శివప్రసాద్, గుడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed