traffic police : పోలీసుల సేవలు భేష్..

by Sumithra |   ( Updated:2024-08-01 13:11:12.0  )
traffic police : పోలీసుల సేవలు  భేష్..
X

దిశ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఓ లారీలో ఉన్న ఉల్లిగడ్డలతో పాటు మరో లారీలో ఉన్న బీర్లు రోడ్డు పై చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో అప్పటికే సుమారు జాతీయ రహదారి పై నాలుగైదు కిలోమీటర్ల మీరు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నానా ఇబ్బందులు పడిన పోలీసులు అతికష్టం మీద లారీలను పక్కకు తీసి వేశారు.

కానీ జాతీయ రహదారి పై ఉన్న బీరు సీసాలు, ఉల్లిగడ్డలతో వాహనదారులకు ఇబ్బంది జరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు పక్కనే ఉన్న చెట్టు కొమ్మలను విరిచి పొరకలుగా చేసి రోడ్డు మొత్తం శుభ్రం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రాఫిక్ పోలీసులు చేసిన సేవలను భేష్ అని కొనియాడుతున్నారు.

Next Story