నేను కూడా హాస్టల్ లోనే చదివా.. ఎమ్మెల్యే సామెల్

by Sumithra |
నేను కూడా హాస్టల్ లోనే చదివా.. ఎమ్మెల్యే సామెల్
X

దిశ, తుంగతుర్తి : కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రభుత్వానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ స్పష్టం చేశారు. అందుకే ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తిస్తూ వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. విద్యార్థులకు మెస్, డైట్ చార్జీలు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కు ధన్యవాదాలు తెలుపుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (బాలికలు) శనివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తాను కూడా హాస్టల్ లో ఉంటూ చదువుకున్న వాడినేనని, అందుకే వారి సాధక బాధకాలన్నీ తెలుసునని వివరించారు.

ఈ మేరకు మెస్, డైట్ చార్జీల పెంపు పై తానే స్వయంగా అసెంబ్లీలో చర్చించడంతో పాటు డిప్యూటీ సీఎం, సంబంధిత శాఖ మంత్రి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, తదితరులను స్వయంగా కలిసినట్లు తెలిపారు. పెరిగిన చార్జీలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. గత ప్రభుత్వం ఏనాడు కూడా విద్యావ్యవస్థను పట్టించుకోక వివక్షత చూపిందని విమర్శించారు. నియోజకవర్గంలోని తొండ గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ, వెలుగుపల్లి వద్ద ఇండస్ట్రియల్ పార్క్ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, ఎంఈఓ బోయిని లింగయ్య, కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed