అసైన్డ్ ,ఇరిగేషన్ భూములపై సర్వే

by Naveena |
అసైన్డ్ ,ఇరిగేషన్ భూములపై సర్వే
X

దిశ, నూతనకల్: అక్రమ ప్లాట్ల,లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు గత సర్కారు ఎల్ఆర్ఎస్ స్కీమును తీసుకొచ్చింది. దీంతో వేలాదిమంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో అసైన్డ్ భూములు అధికంగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం రెవిన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లకు సర్వే బాధ్యతలు అప్పగించారు. దీనిలో భాగంగా శనివారం నూతనకల్ మండల పరిధిలోని ఎర్ర పహాడ్ క్రాస్ రోడ్డులోని 77వ సర్వే నెంబర్లో కలెక్టర్ ఆదేశాల మేరకు..తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో సర్వే జరిపిన అనంతరం దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి..ఆన్లైన్ లో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే వారి వెంట ఇరిగేషన్ ఏఈ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హసన్, ఏఎస్ఓ నవీన్, పంచాయతీ కార్యదర్శి రవి శర్మ, కారోబార్ వెంకన్న తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed