- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ తగాదాలతో హత్య చేసేందుకు సుపారి
దిశ, కోదాడ: చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెంలో భూతగాదాలు హత్యాయత్నానికి దారి తీసాయి. గ్రామానికి చెందిన వేమూరి సుధాకర్ భార్య శ్రీలక్ష్మి సోమవారం ఉదయం వాకింగ్‌కి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కర్రలతో తలపై బాది హత్యాయత్నానికి యత్నించారని కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కటకముల గూడెం గ్రామానికి చెందిన వేమూరి నవీన్ రంగిశెట్టి నరసింహారావులకు, సుధాకర్‌కు మధ్య భూవివాదాలు ఉన్నాయి .
ఈ నేపథ్యంలో నవీన్, నరసింహారావులు వేమూరి సుధాకర్ పై హత్యకు కోదాడకు చెందిన గుంజ జ్ఞానారావ్ కట్టమని యశ్వంతులతో రూ. 60000 ఇచ్చి హత్య చేసేందుకు సుపారి మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగా గణేష్ , యశ్వంతలు, వేమూరి సుధాకర్ భార్య సోమవారం ఉదయం వాకింగ్‌కి వెళ్లి వస్తుండగా కర్రతో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.