- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెంబేలిస్తున్న గ్రామ సింహాలు.. కనిపిస్తే అంతే సంగతులు
దిశ, గరిడేపల్లి: గ్రామాన్ని రక్షించే గ్రామ సింహాలు ఇప్పుడు ప్రజల పాలిట మృత్యు సింహాలుగా మారుతున్నాయి . విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కుక్కలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి . గరిడేపల్లి మండలం పరిధిలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సుమారు 100-150 వీధి కుక్కలు ఉంటాయి. గ్రామాల్లో స్వేచ్ఛగా స్వర విహారం చేస్తూ, కనబడిన వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా పోయింది.
కుక్కల స్వైర విహారం..
కుక్కల దెబ్బకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు సరిగ్గా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా సేద తీరుతున్నాయి . పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై కుక్కలు దాడికి పాల్పడుతున్నాయి. దాంతో రాత్రిళ్లు ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది.
మూగ జీవాల పైన దాడి..
మండల వ్యాప్తంగా కుక్కల దాడిలో పలువురి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి . ఈ విధంగా కుక్కల దాడిలో గొర్రెలు, లేగ దూడలు మృత్యువాత చెందటంతో పాడిపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్ట పోతున్నారు.
కుందూరు రామిరెడ్డి, రైతు:
'మా గేదె ఇటీవల ఈనింది. ఆ దూడను రాత్రింబవళ్ళు కాపాడుకోవాల్సి వచ్చింది. రాత్రి మేము పడుకున్న తర్వాత మా దూడను వీది కుక్కలు చంపాయని' ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.