శ్రీ కనక మహాలక్ష్మి దేవిగా శ్రీ రేణుక ఎల్లమ్మ భక్తులకు దర్శనం

by Naveena |
శ్రీ కనక మహాలక్ష్మి దేవిగా శ్రీ రేణుక ఎల్లమ్మ భక్తులకు దర్శనం
X

దిశ,కనగల్లు: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం రెండవ లక్ష్మివారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ కనక మహాలక్ష్మి దేవిగా రేణుక ఎల్లమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద కుంకుమార్చనలు, గోత్రనామాలు, అమ్మవారి కల్యాణాలు నిర్వహించరు. పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయం వద్ద వాహన పూజలు అధిక సంఖ్యలో భక్తులు చేయించుకున్నారు. ఆలయం వద్ద భక్తులు ముడుపులు కట్టి, అమ్మవారికి చీర, సారే, ఒడిబియ్యం, నైవేద్యంగా బోనాలు, మేకపోతులు ,కోడిపుంజులు సమర్పించారు. అర్చకులు ఆలయం వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో జే.జయరామయ్య ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed