- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
SP Sarath Chandra Pawar : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలి..
దిశ, నాగార్జునసాగర్ : మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని నాగార్జునసాగర్ విజయపురి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పనితీరు, పోలీసు స్టేషన్ పరిధిలోని స్థితిగతులు గురించి విజయపురి సర్కిల్ సీఐ బీసన్న, ఎస్సై సంపత్ గౌడ్ ను అడిగి తెలుసుకుని, రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, ఎస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. హైవే వెంట దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రొలింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వహులకు అవగాహన పెంచాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు.
నాగార్జునసాగర్ రెండు రాష్ట్రాలకు సరిహద్దులో అక్రమ గంజాయి రవాణా జరగకుండా అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్, బీట్లు నిర్వహించాలని పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదుల పై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగజేసేలా పని చేయాలని, అప్పుడే ప్రజలలో పోలీస్ శాఖ పైన నమ్మకం కలుగుతుంది అన్నారు.
మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన..
సుదూర ప్రాంతాల ప్రజలకు మండల స్థాయిలోనే పరిష్కరించే దిశగా చర్యలు. నాగార్జున సాగర్ పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి మండల పోలీసు స్టేషన్ పరిధిలోని విశేష స్పందన వచ్చింది. జిల్లా ఎస్పీ ఫిర్యాదారులతో తమ సమస్యల పట్ల నేరుగా మాట్లాడి, పరిశీలించి సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్నరని దీని కొరకు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించటమే ధ్యేయంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారన్నారు. ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి వారానికి ఒక సారి మండల పోలీసు స్టేషన్లో మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, విజయపురి సర్కిల్ సీఐ బీసన్న, ఎస్సై సంపత్ గౌడ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.