డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా పొదల్లోకి స్కూల్‌ బస్సు

by Naveena |
డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా పొదల్లోకి స్కూల్‌ బస్సు
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ రూరల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సు నిలిచిపోవడంతో విద్యార్థులకు త్రుటిలో అపాయం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం చిల్లపల్లి గ్రామ సమీపంలోని సిటీ సెంటర్ స్కూల్ కు చెందిన 30 మంది విద్యార్థులు అవంతిపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాఠశాల బస్సులో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా.. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో..మొదటగా గోడను ఢీకొని అనంతరం చెట్ల పొదల్లోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది విద్యార్థులలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాస్పిటల్ కి చేరుకొని..విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం గుడికి వెళ్లకుండా..కేవలం డ్రైవర్ ఒక్కడే తీసుకెళ్లడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed