- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్తీ ఆహార పదార్ధాలకు కేరాఫ్ కోదాడ..
దిశ, కోదాడ టౌన్ : కోదాడ పట్టణంలో కల్తీ ఆహార పదార్దాల అమ్మకంతో దుకాణ యజమానులకు కాసులు కురుస్తుండగా వినియోగదారులకు మాత్రం అనారోగ్యం మిగులుతుంది. పట్టణంలో జొన్నల నుండి మొదలుకొని నూనెల వరకూ అన్నీ కల్తీ పదార్ధాలే విక్రయిస్తున్నా అధికారులు మాత్రం అంటి ముట్టనట్టు వ్యవరిస్తుండటం ఆశ్చర్యం. ప్రజలు నిన్న మొన్నటి వరకు ఒక పక్క కరోనా, మరోపక్క హార్ట్ స్ట్రోక్ లతో భయం భయంగా బతుకుతుండగా అవి చాలవన్నట్లు కొందరు వర్తకులు వారి స్వలాభం కోసం ఆహార పదార్ధాలను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకున్న చందంగా తయారవుతున్నారు.
తెల్ల జొన్నలకు రంగు వేసి అమ్మకం..
కోదాడ పట్టణంలో, చుట్టుపక్కల పల్లెలలో అమ్మే జొన్నలు చాలా వరకు రంగు వేసిన జొన్నలు అమ్ముతున్నారు. తెల్లజొన్నలకు పసుపు పచ్చరంగు వేసి పచ్చ జొన్నలని నమ్మించి అమ్ముతున్నారు. తెల్ల జొన్నలకు, పచ్చజొన్నలకు క్వింటాల్ కు ముడువేల ఐదు వందల వరకు ధరలో తేడా ఉండటంతో ఈ పని చేస్తున్నారు. ఇలా రంగు వేసిన జొన్నల వలన చర్మసంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడేప్రమాదం అధికంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కల్తీ నూనె- పల్లీ చెక్క
పట్టణంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులు అధికంగా ఊరూ, పేరు లేని నూనెలను వాడుతున్నారు. బజ్జీల బండి మొదలు, టిఫిన్ సెంటర్ ల వరకు దాదాపు నూటికి తొంభై మంది వాడే నూనెలు ఎవ్వరికీ తెలియని కంపెనీలే. కేజీ నూటా ఇరవై వరకు ఉన్న పామాయిల్ ప్యాకెట్ డెబ్బై రూపాయలకు వస్తుండటం, ఆహార పదార్ధాల టేస్ట్ అదిరి పోవటంతో ఎవరూ అంతగా ఆలోచించట్లేదు. ఈ కల్తీ నూనెల వలన దీర్ఘ కాలంలో అల్సర్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయని, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ నూనెను వాడుతుండటం వలన అనేక రకాల జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉందని, వేసవిలో గుండె సంబంధిత వ్యాధులకు కూడా కల్తీ నూనెలు కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టణంలో కొన్ని టిఫిన్ సెంటర్లలో పల్లీ చట్నీ రుచి కోసం చట్నీలో గేదెలకు వాడే చెక్కను వాడుతున్నారు. దీని వలన విపరీతమైన జోర్ణకోశ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించి ఆహార పదార్ధాల కల్తీ పై ఉక్కు పాదం మోపి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాలని పలువురు కోరుతున్నారు.