సాయి రక్ష హాస్పిటల్ నిర్వాకం.. మహిళ కడుపులో క్లాత్ మర్చిపోయిన డాక్టర్లు

by Mahesh |   ( Updated:2023-06-14 06:32:11.0  )
సాయి రక్ష హాస్పిటల్ నిర్వాకం.. మహిళ కడుపులో క్లాత్ మర్చిపోయిన డాక్టర్లు
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాయిరక్ష హాస్పిటల్ డార్టర్లు చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునుగోడుకు చేందిన వసంత అనే మహిళ సంవత్సరం క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. దీంతో సాయి రక్ష హాస్పిటల్ వారు మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ మర్చిపోయారు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియలేదు. కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వసంత మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కాగా గత సంవత్సర కాలంగా ఆమె కడుపునొప్పితో బాదపడుతూనే ఉంది. అయితే రెండు రోజుల క్రితం సమస్య తీవ్రతరం కావడంతో హైదరాబాద్ కామినేనిలో చేయగా.. వసంత కడుపులో క్లాత్ ఉండటం ద్వారా ఇన్ఫెక్షన్ అయిందని.. వెంటనే ఆమెకు అపరేషన్ చేసి క్లాత్‌ను బయటకు తీశారు. అయితే సాయి రక్ష హాస్పిటల్ యజమాన్యం ఆపరేషన్ పేరుతో సంవత్సరం క్రితం లక్షల్లో వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. అలాగే పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడిన సాయిరక్ష హాస్పిటల్ లో సీజ్ చేయాలంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed