- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్‌లో ప్రభంజనం సృష్టించిన సాయి దిశ్విత.. ఆల్ ఇండియాలోనే
దిశ, తుంగతుర్తి: దేశవ్యాప్తంగా వెలువడిన నీట్-2024 పరీక్షా ఫలితాల్లో ఎడ్ల సాయి దిశ్విత ప్రతిభను చాటుకున్నారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో 491 ర్యాంక్ సాధించారు. మొత్తంగా 720 మార్కులకు గాను 657 (98.97 శాతం) సాధించారు. సాయి దిశ్విత చిన్నతనం నుంచి చదువులో ప్రతిభను కనబరుస్తున్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో ఏడవ తరగతి, సూర్యాపేటలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హైదరాబాద్ చైతన్య కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసి 965 మార్కులతో అత్యుత్తమ స్థాయి ప్రతిభను సొంతం చేసుకున్నారు. సాయి దిశ్విత తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. తండ్రి ఎడ్ల గోపయ్య తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ జెడ్పిహెచ్ఎస్ లో ఫిజికల్ సైన్స్, తల్లి శారద ప్రభుత్వ మైనార్టీ గురుకులంలో జూనియర్ లెక్చరర్ (తుంగతుర్తి, ఇంగ్లీష్) గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కనపర్చిన సాయి దిశ్వితను పలువురు అభినందించారు.