- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకులు మృతి
దిశ, తిరుమలగిరి (సాగర్) : సంక్రాంతి పండగ పూట రంగుండ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ పూట సరదాగా గడిపిన ఆ కుటుంబం అంతలోనే మరణ వార్త వింటారని అనుకోలేదు. రోడ్డు ప్రమాదానికి గురై తండ్రి, కొడుకు దుర్మరణం చెందారు. ఆ కుటుంబానికి వారే పెద్ద దిక్కు కావడంతో కుటుంబ సభ్యులు మృతదేహాల వద్ద రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన తండ్రి ఆంగోతు మోతీ రామ్, కొడుకు బాబురావు శనివారం రాత్రి మాచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం వారి భౌతికకాయాలను వారి స్వగ్రామం రంగుండ్లకు తీసుకురావడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాల వద్ద వందల సంఖ్యలో గ్రామస్తులు చేరుకొని విలపించిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఆంగోత్ బాబురావు తిరుమలగిరి (సాగర్) పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా సేవలందిస్తున్నారు. ఆదివారం వారి మృతదేహం వద్ద పలువురు నివాళులు అర్పించారు. మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి రంగంలో గ్రామానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు తెలుసుకున్నారు. మృతదేహాల వద్ద నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోంగార్డుల ఆర్ఐ స్పర్జన్, మిర్యాలగూడ ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లు,పెద్దవూర ఎస్ ఐ పచ్చిపాల పరమేష్, తిరుమలగిరి సాగర్ ఎస్ ఐ సుధాకర్, ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, డీఎస్పీ బాలాజీ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సాగర్ అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్, తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు మృతదేహాల వద్ద నివాళులర్పించారు.