చెరువుల పున:నిర్మానంతో భూగర్భ జలాల పెంపు : మునుగోడు ఎమ్మెల్యే

by Sumithra |   ( Updated:2023-05-31 14:15:19.0  )
చెరువుల పున:నిర్మానంతో  భూగర్భ జలాల పెంపు : మునుగోడు ఎమ్మెల్యే
X

దిశ, మునుగోడు : చెరువుల పున:నిర్మానం చేయడంతో అడుగు జలాలు పెరిగి రైతులు పంటలను సమృద్ధిగా పండించుకుంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక సత్యఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ పై మునుగోడు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అడగకముందే ప్రజల అవసరాలు తీర్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పథకాలను ఆదర్శ పథకాలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం గ్రామ గ్రామాన పర్యటిస్తామన్నారు. రైతుల పండించిన వరిధాన్యాన్ని ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతుందన్నారు. ఉచితాలను ఆపమని కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చిన తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు నడుస్తున్నాడన్నారు. 21 రోజులపాటు అన్ని మండలాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అన్ని మండలాలలో ప్రతికార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

పలుశాఖలు చేసిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారుల పైన ఆధారపడి ఉంటుందన్నారు. మహిళా ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీవో ప్రేమ్ కరణ్ రెడ్డి, వివిధ మండలాల ఎంపీపీలు గుత్త ఉమాదేవి, శ్వేత, జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, వీరమల్ల భానుమతి, సర్పంచులు మిర్యాల వెంకన్న, సురిగి యాదయ్య, ఎంపీడీవోలు యాకుబ్ నాయక్, విజయభాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఏడీఏ ఎల్లయ్య, డీటీసీఓ కళ్యాణ్ చక్రవర్తి, వ్యవసాయ శాఖ మండల అధికారి శ్రీనివాస్, ఎంపీటీసీలు బీమనపల్లి సైదులు, పొలగోని విజయలక్ష్మి సైదులు, వంటేపాక వెంకటమ్మ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed