చదువే భవిష్యత్తుకు బాటలు వేస్తుంది

by Naveena |
చదువే భవిష్యత్తుకు బాటలు వేస్తుంది
X

దిశ,వలిగొండ: విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే చదివే భవిష్యత్తుకు బాటలు వేస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, చదువుతూనే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని సూచించారు.

పరీక్షలు భయంతో కాకుండా ప్రశాంతంగా రాయాలని,పరీక్షా సమయానికి ముందుగా చేరుకోవాలన్నారు. పరీక్ష గదిలోకి వెళ్లిన తర్వాత పరీక్ష పేపర్లు రెండు నిమిషాలు చదివి మీకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి,తర్వాత రాని ప్రశ్నల గురించి ఆలోచించండి అని తెలిపారు. వందకు వందశాతం ఉత్తీర్ణ సాధించాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి ఆటిపాముల శ్రీనివాస్ కుమారుడు రామరాజు పరీక్ష సామాగ్రి పెన్నులు,పెన్సిల్లు, జామెంట్రీ బాక్సులు,పరీక్ష ప్యాడ్లు అందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లి యాదయ్య, ఎంఈఓ సుంకోజు భాస్కర్,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ విజయలక్ష్మి,ఉపాధ్యాయులు సైదారెడ్డి,శ్రీను, విజయలక్ష్మి, జిలాని, మల్లేశం, స్వామి రాజ్,లింగయ్య, కవిత, వెంకటేశ్వర్లు, నాగేందర్,నవీన్ కుమార్, శివాజీ,విమల,చంద్రకళ,లక్ష్మీ, శారద,హైమద్ విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed