PRTU : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందంజలో పీఆర్టీయూ..

by Sumithra |
PRTU : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందంజలో పీఆర్టీయూ..
X

దిశ, చివ్వేంల : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడటానికి పీఆర్టీయు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని జిల్లా అధ్యక్షుడు జ్యోతుల చంద్రశేఖర్, అన్నారు. మండల కేంద్రంలో బుధవారం మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఒప్పించి బదిలీలు పదోన్నతులు పెంచామన్నారు. పే రివిజన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న డీఏ లతో పాటు పీఆర్సీ ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి చింత రెడ్డి రామలింగారెడ్డి, మాట్లాడుతూ హెల్త్ కార్డుల విషయంలో నూతన విధానాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలియజేశారు. చివ్వేంల, వట్టి ఖమ్మం పహాడ్, చందుపట్ల, గుంజలూరు, తిరుమలగిరి, తిమ్మాపురం, ఐలాపురం, కోమటికుంట, దూరాజపల్లి, పలు గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు షేక్ బషీర్, ప్రధాన కార్యదర్శి పొదిల రవీందర్, తంగిళ్ళ జితేందర్ రెడ్డి, చివ్వెంల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు కళారాణి, శివశంకర్, ఖలీల్ అహ్మద్ ఖాన్, పానుగంటి ప్రతాప్, బండారు చంద్రారెడ్డి, డేగల కృష్ణ, తన్నీరు ప్రమీల, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story