Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌లో 1800 ఎకరాల్లో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదన..

by Sumithra |
Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌లో 1800 ఎకరాల్లో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదన..
X

దిశ, నాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌ అన్నపూర్ణగా విరాజిల్లుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది. విజయపురి సౌత్ పరిధిలో 1800 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007లో నాగార్జునసాగర్ విమానాశ్రయాన్ని విమాన శిక్షణా సంస్థకు ఇచ్చింది. ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఏవియేషన్ సంస్థ శిక్షణా విమానాలను ఇక్కడ నుండే నడుపుతోంది. ప్రభుత్వం నిర్ణయంతో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ విజయపురి సౌత్ లో పర్యటించారు. ప్లై టెక్ ఏవియేషన్ సంస్థకు వెళ్లారు.

అక్కడ యజమాని మమతతో మాట్లాడారు. అనంతరం ఆ సమీపంలో ఉన్న భూములను పరిశీలించారు. నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయ నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఎన్డీయే ప్రభుత్వం సాగర్ లో నూతనంగా 1800 ఎకరాలల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన భూములను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీఓ సరోజిని, డీటీఓ శ్రీనివాసరావు, కెప్టెన్‌ నాని, విజయపురిసౌత్‌ ఎస్సై పట్టాభిరామయ్య ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed