ఈనెల 28న నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశం

by Naresh |   ( Updated:2024-03-21 14:36:55.0  )
ఈనెల 28న నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశం
X

దిశ, హుజూర్ నగర్: ఈనెల 28 నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామంలో గల టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి నల్గొండ పార్లమెంటరీ పరిధిలో గల 7 నియోజకవర్గాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఏఐసీసీ, పీసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాలు నాయకులు హాజరు కావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed