నీట మునిగిన పీహెచ్ సీ

by Nagam Mallesh |
నీట మునిగిన పీహెచ్ సీ
X

దిశ, చిలుకూరు : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వర్షం నీరు తాకిడితో నీట మునిగింది. కొత్త, పాత చిలుకూరు మధ్య ఉన్న అంతరగంగ వాగు పొంగడంతో దాని పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు చేరింది. ఆసుపత్రి ప్రహరీ చాలా మేరకు కూలింది. ఆసుపత్రి అంతా వరదనీటితో బురదమయమైంది. సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది ఆసుపత్రిని శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక కంప్యూటర్ దెబ్బతినగా మందులన్నీ నీళ్లతో తడిచాయి. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.కోటచలం ఆసుపత్రిని పరిశీలించారు. మండలంలోని పాలెఅన్నారం ఊర చెరువు కట్ట తెగి ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో పీహెచ్సీ సిబ్బంది అక్కడ వైద్య శిబిరం నిర్వహించారు. దానిని డీఎంహెచ్వో సందర్శించి పలు సూచనలు చేశారు. వరదతో నష్టం వాటిల్లిన ఆసుపత్రి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. డీఎంహెచ్వో వెంట డిప్యూటీ డీఎంహెచ్వో డా.నిరంజన్, మండల వైద్యాధికారి డా. ప్రియాంక, డా.జ్యోత్స్న, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఏఎన్ఎం నాగలక్ష్మి, ఆశా సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed