- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ర్యాంకులు రాకున్నా నారాయణ స్కూల్ ప్రచారం కొండంత
దిశ, సూర్యాపేట ప్రతినిధి: సూర్యాపేట పట్టణంలోని విద్యా నగర్ లోని ఒ ప్రైవేటు బిల్డింగ్ లో నారాయణ పేరుతో నడుస్తున్న పాఠశాల ఈ ఏడాది పదోవ తరగతి విద్యార్థులను నిండాముంచింది. చదువుకునే రోజుల కంటే చదువుకొనే రోజులు ఎక్కువేయయ్యి అన్నా చదంగా ఈ పాఠశాల తీరుంది.. అధిక ఫీజులను వసూళ్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నారాయణ పాఠశాల పదోవ తరగతి విద్యార్థుల భవిష్యత్ ని గాలికి వదిలివేసి వారి జీవితాలతో విద్య వ్యాపారం సాగిస్తున్నారు. కేవలం ఒక విద్యార్థికి మాత్రమే 10/10 రాగా, ఆ మార్కులనే అందరి విద్యార్థులకు వచ్చాయంటూ ప్రచారం చేస్తున్నారు.
మార్కులు రాకున్నా ప్రచారం మాత్రం మిన్నా..
విద్యా నగర్ లో ఉన్న నారాయణ పాఠశాల పదోవ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినట్లు డంబా ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీతో విద్యనందిస్తున్నట్లు తమను నమ్మించి రూ. లక్షలు వసూలు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థికి ప్రారంభంలో మాట్లాడుకున్న ఫీజు కాకుండా అదనంగా పుస్తకాలు, నోట్సు లంటూ నారాయణ పాఠశాల యాజమాన్యం డబ్బుల దోపిడీకి పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం మాయమాటలు నమ్మి తమ పిల్లలను నారాయణ పాఠశాలలో చేర్పించామని, ఫీజులు కట్టించుకోవడానికి నెల రోజుల సమయం కూడా ఇవ్వకుండా మొత్తం ఫీజులను వసూలు చేసుకున్నారని వారు పేర్కోన్నారు. తాము ఆశించిన స్థాయిలో నారాయణ పాఠశాలలో బోధన లేదని, మంచిమార్కులు సాధించే తమ పిల్లలు నారాయణ పాఠశాలలో చేరిన తర్వాత పాస్ మార్కులతో పదోవ తరగతి ని వెల్లదీశారని వారు తెలిపారు.
విద్యార్థులకు ఆ పరీక్షలు, ఈ పరీక్షలు అం టూ ప్రతి మూడు నెలలకొసరి రూ. 2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూళు చేశారని, అయినా తమ పిల్లలు పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకోవడం ఆశ్చర్యం కల్గిస్తుందని వారు పేర్కోన్నారు. హైదరాబాద్ ఫ్యాకల్టీతో కాకుండా సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఆయా చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఫ్యాకల్టీ తీసుకువచ్చి విద్యార్థులకు బోధన చేశారని ఈ కారణంగానే తమ పిల్లలు పదోవ తరగతి ఫలితాల్లో వెనుకబడ్డారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాలలో పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులు బోర్డు పరీక్షలకు సూమారుగా 45 మందికి పైగా హాజరుకాగా వారిలో ఒక విద్యార్థికి మాత్రమే మొదటి ర్యాంక్ సాధించారు, మిగిలిన విద్యార్థులు పాస్ మార్కులతోనే సరిపెట్టుకున్నారు. మంచి ఫలితాలు రాకున్న సూర్యాపేట పట్టణంలో నారాయణ పాఠశాల యాజమాన్యం జోరుగా ప్రచారం సాగిస్తుండం విడ్డూరంగా ఉంది.
రూ. లక్షల్లో వసూలు చేసిన ఫీజులు..
బిజినెస్ లేకున్నా బిల్డప్ ఎక్కువ అనే సామెత నారాయణ పాఠశాల యాజమాన్యం కు తగ్గట్టుగా సరిపోతుంది. మంచిమార్కులు, ర్యాంకులు రాకపోయిన ఫీజుల విషయంలో మాత్రం అసలు తగ్గరు. వారికి నోటికి ఎంత వస్తే అంతే ఫీజు లాగుతారు.అంతా ఫీజు దేనికి అని విద్యార్థుల తల్లిండ్రులు ప్రశ్నిస్తే నారాయణ పాఠశాల యాజమాన్యం దగ్గర సమాధానం ఉండదు. తమ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తాం, విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెప్పుతాం, తమ పాఠశాలలో ఫ్యాకల్టీకి ఒక్కోక్కరికి పదో సంవత్సరాల బోధన అనుభవం ఉంది. హైదరాబాద్ ఫ్యాకల్టీ ద్వారా విద్యార్థులకు చదువునందిస్తున్నాం. తమ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉంది.
తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు డాక్టర్లు, శాస్త్రవేత్తలు, గోప్ప ఇంజనీర్లు అయ్యారంటూ డిజిటల్ కరపత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులకు చూపి వారిని సులభంగా మాయమాటలతో తమ బుట్టలో వేసుకుంటున్నారు. మొత్తం ఫీజును రెండు పద్దులతో పూర్తి చేయాలని మధ్యలో ఫీజు కట్టకపోతే విద్యార్థి ని ఇంటికి పంపిస్తామని ఒక కండిషన్ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ. లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. విషయం లేనిదానికి ప్రచారం ఎక్కువ అన్నట్లుగా ఏలాంటి ప్రతిభ చూపని నారాయణ పాఠశాలకు స్వంత ప్రచారం ఎక్కువైయిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. నారాయణ పాఠశాల యాజమాన్యం చెప్పుతున్న కట్టు కథలను తల్లిదండ్రులు నమ్మవద్దని పలువురు విద్యావేత్తలు సూచిస్తూన్నారు.
లబోదిబోమంటున్న తల్లిదండ్రులు..
సూర్యాపేట నారాయణ పాఠశాల యాజమాన్యం మాయమాటలు నమ్మి తమ పిల్లల భవిష్యత్ తామే నాశనం చేశామని కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. హైదరాబాద్ నారాయణ అంటే హైదరాబాద్ స్థాయిలో విద్య ఉంటుందని ఆశపడి తమ పిల్లలను నారాయణ పాఠశాలలో చేర్పించామని ఐదోవ తరగతి నుంచి పదోవ తరగతి వరకు ఒక్కోక్క విద్యార్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు నారాయణ పాఠశాల యాజమాన్యం ఫీజులు వసూలు చేసింది. అప్పులు చేసి తమ పిల్లల ఫీజులు చెల్లించామని కానీ పదోవ తరగతిలో తమ పిల్లలకు ఆశించిన మార్కులు రాలేదని వారు మదనపడుతున్నారు. నారాయణ పాఠశాలలో సరైన బోధనలేకపోవడం వల్లే తమ పిల్లలు చదువులో వెనుబడ్డారని కొంతమంది తల్లిదండ్రులు వా పోయారు. రూ. లక్షలు ఖర్చుచేసిన తమ పిల్లలకు మంచి ఫలితాలు రాలేదని, పాఠశాల యాజమాన్యం విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం చూపారని తద్వారానే విద్యార్థులకు మార్కులు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ పాఠశాల యాజమాన్యం తమ పిల్లల చదువులను ఆగామాగం చేసిందని తల్లిదండ్రులు లబోదిమోమంటున్నారు. నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి: అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్ పై విద్యావ్యాపారం చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేసి, సూర్యాపేట జిల్లాలో ఆ పాఠశాల ను ఎత్తివేయాలని పట్టణానికి చెందిన పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంచిమార్కులు సాధించినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.