- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ
దిశ, మోత్కూరు: మోత్కూరు పొడిచేడు గ్రామ పంచాయతీ కార్యదర్శి చిన్నం కిరణ్ రూ. 3000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. గొరిగే మహేష్ తన ఆస్తి విలువ ధృవీకరణ పత్రం జారీ చేయమని దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు ఇస్తేనే ధ్రువీకరణ పత్రం అందజేస్తానని తేల్చి చెప్పడంతో రూ. 3000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో మహేష్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా కిరణ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకొని ప్యాంటు జేబులో నుండి రూ. 3000లు స్వాధీనం చేసుకున్నారు. చిన్నం కిరణ్, పంచాయతీ కార్యదర్శి ప్రతి పనికి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన చిన్నం కిరణ్‌ను అదుపులోకి తీసుకొని అవినీతి నిరోధక కేసు విచారణల ప్రత్యేక కోర్టు మొదటి శ్రేణి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరసనన్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. ఈ దాడుల్లో డీఎస్పీ తో పాటు ఇన్స్పెక్టర్లు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరారు.