ఇడికూడ నిర్మలానందంకు ఉస్మానియా డాక్టరేట్...

by Sumithra |
ఇడికూడ నిర్మలానందంకు ఉస్మానియా డాక్టరేట్...
X

దిశ, చండూరు : చండూరు మున్సిపాలిటికి చెందిన ఇడికూడా నిర్మలానందానికి సాహితీ మేఖల సంస్థ సాహిత్య సేవ అనే అంశం పై పరిశోధనకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకర శర్మ పర్యవేక్షణలో ఈ పరిశోధన కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా ఈ నెల 21 ఆదివారం సాయంత్రం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవులు, రచయితలు, జర్నలిస్టుల వేదిక "రుంజ" నిర్మలానందాన్ని సత్కరించనుంది.

డాక్టరేట్ పొందిన సందర్భంగా సాహితీ మేఖల సంస్థ అధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి, ప్రధాన కార్యదర్శి పున్నఅంజయ్య, వ్యవహర్త మంచుకొండ చిన్న భిక్షమయ్య సభ్యులు మద్దోజు వేంకట సుధీర్ బాబు డా.ఐ.సచ్చిదానందం, రుంజ వ్యవస్థాపక సభ్యులు దాసోజు కృష్ణమాచారి, లలిత, చండూరు పురపాలక సంఘం కౌన్సిలర్ అనంత మంగగిరిధర్ గౌడ్ లు అభినందనలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed