బొల్లం మల్లయ్య యాదవ్ నామినేషన్

by Naresh |   ( Updated:2023-11-08 09:28:51.0  )
బొల్లం మల్లయ్య యాదవ్ నామినేషన్
X

దిశ, కోదాడ టౌన్: కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ కోదాడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:11 కు ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా కోదాడకు రావాలని పార్టీ అభిమానులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించకపోయినా పిలిస్తేనే కాదు తెలిస్తే చాలు వచ్చేస్తాం అన్నట్లుగా నియోజకవర్గంలోని గ్రామాల నుంచి వందలాదిగా తరలివచ్చారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం ప్రాంతంలో సందడి నెలకొంది. కార్యకర్తల నినాదాలు, మహిళల నృత్యాలు, డీజే చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. నామినేషన్ అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా బంతిపూల వాన కురిపిస్తూ, మల్లయ్య మెడలో దండలు వేస్తూ పార్టీ శ్రేణులు ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇంత అభిమానాన్ని చూసిన బొల్లం మల్లయ్య యాదవ్ చెమర్చిన కళ్లతో విక్టరీ గుర్తు చూపిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి మధు, పార్టీ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, సుంకరి అజయ్ కుమార్, నయీం, అలసకాని జనార్థన్, దొడ్డా సురేష్ బాబు, కస్తూరి నర్సయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story