- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్స్య శేష వాహనంపై ఊరేగిన నారసింహుడు
by Naresh |
X
దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు స్వామివారు మత్స్యావతారంలో అలంకృతుడై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోక రక్షణార్ధం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదం పరిరక్షణ, శిష్ట పరిరక్షణ చేయడం జరిగింది. ఆలయ తూర్పు మాడవీధుల్లో స్వామి వారిని అధిష్టింపజేసీ రెండు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల చేత వేదపారాయణాలు సమర్పించారు. సాయంత్రం స్వామి వారి శేష వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో ఆలయ ఈవో రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి. నరసింహ మూర్తి, భాస్కర్ శర్మ, రఘు బాబు, శ్రావణ్ పాల్గొన్నారు.
Advertisement
Next Story