- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోహన్‌బాబును అరెస్టు చేయాలి
దిశ,సంస్థాన్ నారాయణపురం : జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నారాయణపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జర్నలిస్టులు రోడ్డుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ..విధి నిర్వహణలో భాగంగా సినీనటుడు ఇంటి వద్ద వార్తా కవరేజ్ కి వెళ్ళిన..జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేసి గాయపరిచిన మోహన్ బాబు బేషరతుగా జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకు రావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కలకొండ సంజీవ, జర్నలిస్టులు చిలువేరు అంజయ్య, కొండ శ్రీను, చిలువేరు వీరేశం, పందుల నరసింహ, పాలకూర్ల యాదయ్య,ఎస్కే పాషా, ఉప్పల వెంకటేష్, చిలువేరు సంజీవ,చిలువేరు రమేష్, గంగాపురం సాయి,బాకారం నాగర్జున తదితరులు పాల్గొన్నారు.