MLA Nenawat Balu Naik :వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

by Naveena |
MLA Nenawat Balu Naik :వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ, డిండి : మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ( MLA Nenawat Balu Naik)ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులకు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని,దొడ్డు వడ్లకు రూపాయలు 2320 ఇస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని,ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. పేదలకు,రైతాంగానికి మేలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.రైతు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి రెండు లక్షల రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వము చేసిందని గుర్తు చేశారు.సంక్రాంతి నుంచి పేదలకు, స్కూలు విద్యార్థులకు, హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. గతంలో పనిచేసిన ప్రభుత్వానికి రైతుల పట్ల,పేదల పట్ల ,చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పేదలను గాని ,రైతాంగాన్ని గాని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.

రైతు భరోసాలో భాగంగా అర్హులైన రైతులందరికీ ఒక ఎకరానికి సంవత్సరానికి 15 వేల రూపాయలు తప్పకుండా చెల్లిస్తామని అన్నారు. సిసిఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు పొందాలని సూచించారు. మార్కెట్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో 32 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఒక్కొక్కరికి 1,00, 116 రూపాయలు చొప్పున చెక్కులను అందించారు.పిఎసిఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నూతనముగా నిర్మించిన గోదాంను డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ మార్కెట్ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ మాధవరం గోవర్ధన్ రావు, పిఎసిఎస్ చైర్మన్లు మాధవరం శ్రీనివాసరావు, తూము నాగార్జున రెడ్డి, చిత్రియాల పిఎసిఎస్ చైర్మన్ జ్వాల నరసింహారెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్ ,మండల ప్రత్యేక అధికారి సాయి బాబా, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, తహసిల్దార్ అంబటి ఆంజనేయులు, డిప్యూటీ తాసిల్దార్ రాగ్యా నాయక్, ఆర్ ఐ లు శ్యాం నాయక్, లింగం, ఎంపీడీవో వెంకన్న, ఏవో రామలింగేశ్వరరావు ,ఏఈఓ పరమేశ్వరి, డిసిఓ శంకర్రావు, మాజీ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ పేరువాళ్ళ జంగారెడ్డి, దొంతినేని దామోదర్ రావు, నల్లవెల్లి అల్వాల్ రెడ్డి, యాసాని హనుమంత్ రెడ్డి, మల్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, తూము బుచ్చిరెడ్డి, బొడ్డుపల్లి వెంకటరమణ, కనకాచారి, తిప్పర్తి విజయేందర్ రెడ్డి, శైలేష్, గుర్రం రాములు, మేకల కాశన్న , బాదమోని శ్రీనివాస్ గౌడ్, పోలా వెంకటేష్, పోలం లక్ష్మణ్ నూకం వెంకటేష్ గడ్డమీది సాయి, వంగాల లక్ష్మారెడ్డి, సీఈఓ బాల్ రెడ్డి , పిఎసిఎస్ డైరెక్టర్లు, రైతులు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed