- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ కు ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల పై ఉన్న ప్రేమ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల పై లేదు !
దిశ, దేవరకొండ, చందంపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల పై ఉన్నప్రేమ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల పై లేదని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నక్కల గండి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆదివారం 21వ తేదీన కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాడే నక్కలగండి ప్రాజెక్టును సందర్శించారు. కేంద్రం మంత్రి, బీజేపీ నాయకులు రాత్రివేళలో వెళ్తే ఏం కనిపిస్తుంది ! పగటిపూట వెళ్లాలని హేళన చేసే విధంగా మాట్లాడారు. దీంతో శనివారం దేవరకొండ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నక్కలగండి ప్రాజెక్టు వద్దకు పగటిపూటనే పనులను పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు తట్టెడు మట్టి తీసే వ్యక్తి గాని, ప్రాజెక్టుకు సంబంధించిన ఒక మిషనరీ గాని కనిపించలేదని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే దేవరకొండ నియోజకవర్గం ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాల మాటలు చెప్పుతూ, ప్రాజెక్టుల పేరుతో మళ్లీ దేవరకొండ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నక్కల గండి ప్రాజెక్టుకు మూడు సంవత్సరాల నుండి ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి తీసేనాధుడు లేడని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రాజెక్టును సందర్శించి, పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే జీర్ణించుకోలేక బీజేపీ నాయకుల పై అవాకులు చివాకులు పేల్చుతున్నారని అన్నారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి నక్కలగండి ప్రాజెక్టు పనులను పూర్తిచేయడం కోసం నిధులు తీసుకువచ్చి కేసీఆర్ బదులు ఎమ్మెల్యేనే కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కోసం ఖాళీ కూర్చి వేసి నిరసన తెలియజేశారు. నక్కల గండి పనులను పూర్తి చేసిన తర్వాతనే రానున్న ఎన్నికల్లో రవీంద్ర కుమార్ ఎన్నికల్లో పోటీచేయాలని, లేని యెడల తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు బహిరంగ సవరణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం 300 కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తయ్యే నక్కలగండి ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు ! ఈ ప్రాంతం మీద ఎందుకు వివక్షత చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లాలోనే సుమారు 12 మండలాలకు సంవత్సరానికి మూడు పంటలకు సాగునీరు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. చేతగాని కేసీఆర్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ ఏటి కృష్ణ, రాష్ట్ర నాయకులు కేతావత్ లాలూ నాయక్, కళ్యాణ్ నాయక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమోని రాములు, వివిధ మండలాల అధ్యక్షులు గుండాల అంజయ్య, అంజి నాయక్, పబ్బు సైదులు గౌడ్, జల్దా భాస్కర్, చివర్ల రమేష్ వానం నరేందర్ రెడ్డి, మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి, బొడిగె సాంబశివుడు, బహుదూర్ సింగ్, వినోద్ రాథోడ్, కొమ్ము వెంకటయ్య, పగిళ్ల సాగర్, మల్లేష్ నాయక్, చిలక రాజు శ్రీను, చండీశ్వర్, మేళ్ల సాయికుమార్, నాగిల్ల అంజి, అర్థం రమేష్, సముద్రాల సహదేవ్, సైదులు, శ్రీను, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.