కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మేల్యే భగత్

by S Gopi |
కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మేల్యే భగత్
X

దిశ, హలియా: హాలియా పట్టణం స్థానిక 4 వ వార్డులోని ఆకాంక్ష స్కూల్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు నోముల భగత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను, ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు యంత్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. మున్సిపాలిటీలో ఇప్పటివరకు జరిగిన శిబిరాల వివరాలు, రిజిస్టర్ల నిర్వహణ తదితర విషయాలపై సిబ్బందితో చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు, చైర్ పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి, పీహెచ్ సీ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story