- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయసముద్రం ప్రాజెక్టును వచ్చేనెల ప్రారంభిస్తాం : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
దిశ, నకరేకల్ : బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల ఉదయ సముద్రం ప్రాజెక్టును మే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి బుధవారం ఉదయం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన ప్రాజెక్ట్ పనులపై సీఎం కేసీఆర్ తనతో పాటుగా స్మిత సబర్వాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారని, వెంటనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మైనింగ్ పనులు, విద్యుత్ పనులు పూర్తయ్యాయన్నారు.
ఓపెన్ ఛానల్, పిట్టంపల్లి వద్ద ఉన్న చిన్నపాటి మరమ్మత్తులను 15 రోజుల్లో అధికారులకు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశానన్నారు. కెనాల్ పనులకు 40 కోట్లు మంజూరు చేశామన్నారు. భూసేకరణకు రైతులు పూర్తిగా సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలలో ట్రయల్ రన్ చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు పలుమార్లు సూచించినట్లు వివరించారు. ఈ సమావేశంలో సర్పంచులు యానాల మాధవిఅశోక్ రెడ్డి, కొత్త నరసింహ, ఎంపీటీసీ సభ్యులు చిరుమర్తి యాదయ్య, మాజీ సర్పంచ్ మల్లెబోయిన సైదులు, యూత్ నాయకులు నడింపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.