- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రిలో మంత్రి మల్లారెడ్డి పర్యటన..
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట నరసింహుడి విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం తన స్నేహితుడి తరఫున రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పటికే స్వర్ణ తాపడం కోసం రూ.5 కోట్లు రూపాయల విలువ చేసే 10 కిలోల బంగారం విరాళంగా ఇచ్చాడు మంత్రి మల్లారెడ్డి. అయితే తన స్నేహితుడు రామకృష్ణారెడ్డి నరసింహ స్వామి వారి ఆలయానికి విరాళమిచ్చాడని తెలిపారు.
అలాగే సీఎం కేసీఆర్ వచ్చాక తెలంగాణలో దేవాలయాలన్ని అభివృద్ధి చెందాయన్నారు. భక్తులకు కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సిలిండర్ ధరలు భారీగా పెంచారన్నారు. రూ. 400 సిలిండర్ రూ. 1200 కు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2024 లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తప్పకుండా సిలిండర్, పెట్రోల్ ధరలు పేద ప్రజలకు అన్నిటినీ అందుబాటులో తీసుకువచ్చి యువత ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కేసీఆర్ ను ప్రధాని చేయాలని నరసింహ స్వామి కి మొక్కుకున్న అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.