ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

by S Gopi |
ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి
X

దిశ, చిలుకూరు: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత తెస్తామని బీజేపీ హామీ ఇచ్చి తొమ్మిదేండ్లవుతున్నా అమలుకు నోచుకోలేదని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ చట్టబద్ధత కావాలంటూ చేపట్టిన మాదిగల సంగ్రామ యాత్ర బుధవారం చిలుకూరుకు చేరుకుంది. హామీ అమలు చేయని బీజేపీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాయకులు జేజే నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాత్ర ఈ నెల 15న హైదరాబాద్ చేరుకుంటుందని, నగరం చుట్టూ జాతీయ రహదారుల దిగ్బంధం చేపడతామని వారు అన్నారు. పాదయాత్రకు స్వాగతం పలికినవారిలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు వడ్డేపల్లి కోటేశ్, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి మల్లెపంగు సూరిబాబు, కోదాడ ఇంఛార్జి పిడమర్తి పెద వెంకట్రావు, నాయకులు మౌలానా, సిద్దెల శ్రీను, అంజిబాబు, పిచ్చయ్య, మనోహర్, వడ్డేపల్లి రామకృష్ణ, అమరారపు సైదులు, మల్లెపంగు మహేష్, పిడమర్తి వెంకట్రావు, కందుకూరి అఖిల్, రామారావు, కార్తిక్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story