శాలిగౌరారం కేజీబీవీకి సుస్తీ..విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

by Aamani |
శాలిగౌరారం కేజీబీవీకి సుస్తీ..విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
X

దిశ, శాలిగౌరారం : అది ప్రభుత్వ నిధులతో నడిచే బాలికల పాఠశాల. కానీ దాని నిర్వహణ మాత్రం ప్రైవేట్ సామ్రాజ్యాన్ని తలపిస్తుంది. బాలికల తల్లితండ్రుల కు సైతం అందులోకి ప్రవేశం లేదు.కేజీబీవీ లో తరచూ ఫుడ్ పాయిజన్ అవుతూ విద్యార్థినులు అనారోగ్యం పాలవుతున్న పట్టించుకోకుండా ఎస్ ఓ, స్టాఫ్ వ్యవహరిస్తున్నట్లు, తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమడుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఉడికి ఉడకని అన్నం,అన్నం లో తరచూ పురుగులు వస్తున్నాయని ఎస్ ఓ మేడం కి తెలియజేస్తే పట్టించు కోకుండా ఈ విషయం బయటకు తెలియజేయకుండా విద్యార్థినుల నోరు కట్టేస్తున్నట్టు సమాచారం .బుధవారం రాత్రి 10 : 30 సమయం లో పలువురు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురి కావడం తో దగ్గర లో పీహెచ్సీలో చూపించకుండా వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి వెంటనే మీ పిల్లలను తీసుకెళ్లండి, ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదని హుకుం చేసి జారీ చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ కే జి బీ వి లో తమ పిల్లలకు రక్షణ లేదని, మేము చాలా సమస్యల తో దూరం వెళ్ళి బ్రతుకుతున్నామని, అనారోగ్య సమస్యల పై మాకు ముందస్తు సమాచారం ఇవ్వట్లేదని,తమ పిల్ల లతో మాట్లాడదామని కాల్ చేసిన పిల్లలకు ఫోన్ ఇవ్వరని దాంతో మాకు వాళ్ళ మంచి చెడు ఎలా తెలుస్తాయని వాపోయారు. కే జి బీ వి లో తమ పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని,అన్నం లో తరచూ పురుగులు వస్తున్నాయని, అన్నం ఉడికి ఉడకనట్టు గా, కూర లలో నాణ్యత లేదని , బాత్ రూమ్ సమస్య లతో పాటు చాలా సమస్యలు ఉన్నాయని , ఈ సంబంధిత సమస్యల పైన ఎస్ ఓ మేడం ను కలుద్దామని వెళ్లిన లోనికి ప్రవేశం ఉండదని అన్నారు.

బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఒక విద్యార్థిని పేరెంట్స్ దిశ తో మాట్లాడుతూ మా కూతురు ఆరోగ్యం పట్ల ముందస్తు సమాచారం ఇవ్వకుండా కండిషన్ సీరియస్ అయ్యాక తమ మీదికి వస్తుందని భయం తో స్టాఫ్ మాకు సమాచారం ఇచ్చారని, మేము 200 కిలోమీటర్ల దూరం లో ఉన్నామని చెప్పినప్పటికీ కచ్చితంగా రావాలని హుకుం జారీ చేసారని దీంతో,మా కూతురు సీరియస్ కండిషన్ లో ఉన్నదని 10 వేల తో కిరాయి మాట్లాడి కార్ లో వచ్చామని వాపోయారు. ఇలాంటి పరిస్థితి శాలిగౌరారం కే జి బీ వి లోనే ఉందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలపై, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కే జి బీ వి, ఎస్ ఓ, సంబంధింత స్టాఫ్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పిల్లలందరికి వైద్య పరీక్షలు నిర్వహించాము : నాగరాణి ఇంచార్జ్ ఎస్ఓ

కేజీబీవీలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే.గత కొన్ని రోజులుగా వైరల్ జ్వరాలు వస్తున్నాయి. ఇంతకు ముందు పిల్లలందరికి వైద్య పరీక్షలు నిర్వహించాము. మళ్ళీ కూడా నిర్వహిస్తాము.

Advertisement

Next Story