- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం: కవిత
దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, అసెంబ్లీ పాలక్ కవిత అన్నారు. ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని రుద్రారం, హట్యతండాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు, పంటల బీమా, రుణమాఫీ అమలు చేయట్లేదని ఆరోపించారు. ఎన్నికలొచ్చినప్పుడే గిరిజన బంధు, రిజర్వేషన్లు పాలకులకు గుర్తుకొస్తాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో అసెంబ్లీ ప్రభారీ లచ్చిరెడ్డి, నాయకులు సాదినేని శ్రీనివాసరావు, పులి విద్యాసాగర్, కొండేటి సరిత, జంగిలి రవికుమార్, చౌగాని వెంకన్న, యాదమ్మ, భాష, జితేందర్, రామన్ తదితరులు పాల్గొన్నారు.