కన్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు

by Naveena |   ( Updated:2024-11-11 15:45:19.0  )
కన్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు
X

దిశ, మునుగోడు: కన్న కొడుకే తండ్రిని గొడ్డలితో నరికి హతమార్చిన సంఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని చొల్లేడు గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కట్కూరి రామచంద్రం (60) అనే వ్యక్తిని అతని పెద్ద కొడుకు కట్కూరి నరసింహ గొడ్డలితో వెనుక నుంచి మెడపై నరికాడు. దీంతో తండ్రి రామచంద్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed