- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డి సమక్షంలో.. నేడు జిట్టా కాంగ్రెస్‌లో చేరిక
దిశ, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూనే ఇతర పార్టీల నుంచి హస్తం గూటికి చేరేవారికి ఆహ్వాన పలుకుతున్నట్లు ఇప్పటికి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కానీ జిల్లాలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సీనియర్ నేతలు ప్రవర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా తమ పార్టీలో చేరిక లేవని ఇప్పటికే నాయకులు ఎక్కువయ్యారని, వారికి సీట్లు ఇవ్వలేక సర్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అలా చెప్పిన నేతలు ఇప్పుడు మాట మార్చి ఇతర పార్టీ నుంచి వస్తున్న నేతలను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నేడు హస్తం గూటికి జిట్టా..
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు జిట్టా తన అనుచరులతో తరలివెళ్లి కాంగ్రెస్ జెండా కప్పుకోనున్నారు. వాస్తవంగా సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభ లోనే సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేరుతారని అందరూ భావించారు. అయితే పార్టీ స్టార్ క్యాంపెయినర్ , స్థానిక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి అంగీకారంతోనే పార్టీలో చేరాలని అధిష్టానం జిట్టాకు సూచించారు. ఆ క్రమంలోనే పార్టీ బహిరంగ సభకు రెండు రోజుల ముందుగానే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న జిట్టా అనుచరులకు తన కార్యాలయం నుంచి సమాచారం పంపించారు. ముహూర్తం చూసుకొని మరి నేడు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో చేరనున్నారు.
కోమటిరెడ్డి రూట్ మార్చారా..?
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి. అదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం "" జిల్లాలో నాయకులు ఫుల్ గా ఉన్నారు.... ఉన్నవాళ్లకే టికెట్లు ఇవ్వలేక సర్ది చెప్పి ప్రయత్నం చేస్తున్నాం.... ఎలాంటి చేరికలు ఈ జిల్లాలో ఉండబోవు"" అంటూ రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లాలో కేంద్రంలో విలేకరుల సమక్షంలోనే వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత రెండు రోజులకే కోమటిరెడ్డిని జిట్టా బాలకృష్ణారెడ్డి కలిసారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చల అనంతరం బాలకృష్ణారెడ్డి పార్టీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. కోమటిరెడ్డి మాట్లాడిన మాటలకు నేడు బాలకృష్ణారెడ్డి పార్టీలో చేరికలు చూస్తే వెంకటరెడ్డి తన రూటు మార్చారా అనే అనుమానం అందరిలో కలుగుతుంది.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి అడ్డుకట్ట వేయొద్దని అధిష్టానం ఏమైనా కోమటిరెడ్డి కి ఆదేశాలు జారీ చేసిందా తెలియాల్సి ఉంది.
వేముల చేరికపై సస్పెన్షన్ వీడేనా..!
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు ఎక్కడ ప్రకటించిన దాఖలాలు లేవు. తన కార్యకర్తలు ఆ పార్టీలో చేరాలని సూచిస్తున్నారు తప్ప ఇంకా మేము ఏ నిర్ణయము తీసుకోలేదని చాలా మీడియా ఇంటర్వ్యూలలో వేముల ప్రకటించారు. జిల్లాలో జరుగుతున్న చర్చలు ఉద్దేశించి కోమటిరెడ్డి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరికలు లేవని గత కొంతకాలంగా ప్రకటిస్తూ వస్తున్నారు. అది కేవలం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను పెట్టుకొని మాట్లాడుతున్నారని విషయం అందరికీ తెలిసిందే.
అయినా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా వేముల ఆ పార్టీలో చేయడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఇలా ఉంటే తన మాజీ శిష్యుడు ""గెలుపు నల్లేరు మీద నడక లా "" ఉండడానికి వేముల వీరేశం రాకను కోమటిరెడ్డి అడ్డుకుంటున్నారని, ఒకవేళ ఆయన వస్తే తన చెప్పు చేతుల్లో ఉండడనే ఆందోళన కూడా వెంకటరెడ్డికి ఉన్నట్లు ప్రజల్లో వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వేముల చేరికపై సస్పెన్షన్ వీడేనా లేదా ఏం జరుగుతుందో రెండు రోజులు ఆగితే తప్ప తెలియని పరిస్థితి.