ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్న వారందరికీ నష్టపరిహారం అందేలా చూడాలి : ఎమ్మెల్యే

by Kalyani |
ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్న వారందరికీ నష్టపరిహారం అందేలా చూడాలి : ఎమ్మెల్యే
X

దిశ, మునుగోడు: ప్రాజెక్టుల కింద ముంపు ప్రాంతాల్లో మిస్సయిన ఇండ్లు, భూములు ఉంటే వాటిని కూడా నోటిఫై చేసి, భూసేకరణ చేయకుండా మిగిలిపోయిన భూములను సర్వే చేసి ఆ భూములు కలిగిన రైతులకు కూడా నష్టపరిహారం అందేలా చూడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలోని రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో శివన్నగూడెం, కిష్టరాయనిపల్లి సాగునీటి ప్రాజెక్ట్ లపై చండూరు ఆర్డీవో, దేవరకొండ ఆర్డీవో లతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్టుల కింద ముంపు గురవుతున్న గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ పరిహారం విషయాల పై అధికారులకు పలు సూచనలు చేశారు. శివన్నగూడెం ప్రాజెక్టు కింద ముంపు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం వెంకెపల్లి, వెంకేపల్లి తండాలతో పాటు కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్న లక్ష్మణపురం, ఈదులగండి గ్రామాలలో హౌస్ స్ట్రక్చర్ రీవాల్యుయేషన్ చేయాలని, ఈ హౌస్ స్ట్రక్చర్ రివాల్యుయేషన్ లో ఆర్ అండ్ బి అధికారులు తో సమన్వయం చేసుకుంటూ రీవాల్యుయేషన్ చేయాలని సూచించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువకుల వయసుకు సంబంధించి కటాఫ్ డేట్ పెంచాలని అధికారులకు తెలిపారు.

Next Story

Most Viewed