show cause : ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ

by Kalyani |
show cause : ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని గుంపుల తిరుమలగిరి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శనివారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ సందర్శనలో భాగంగా విద్యార్థుల తీరును వారు నేర్చుకున్న పద్ధతిని చూసిన కలెక్టర్ విద్యార్థులను అభినందించారు. దీనిలో భాగంగా హాజరు పట్టికను పరిశీలించగా ముగ్గురు ఉపాధ్యాయులు ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు జిల్లా కలెక్టర్ పి. జానకి, ఎస్ఏ జెడ్పిహెచ్ ఎస్ గుంపుల తిరుమలగిరి, ఆర్. వెంకటయ్య ఎస్ఏ జడ్పీహెచ్ఎస్ గుంపుల తిరుమలగిరి వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఎం నాగమణి ఎస్ఏ సోషల్, జడ్పీహెచ్ఎస్ గుంపుల తిరుమలగిరి ని కలెక్టర్ సస్పెన్షన్ చేశారు.

అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తుంగతుర్తి నియోజకవర్గం పర్యటన చేసి ఎస్ నానో తండా, ఎంపీపీ ఎస్ బండ రామవరం పాఠశాలలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైన పి. సత్యమూర్తి ఎస్జీటీ నానో తండా, టి వెంకటరాములు ఎస్జీటీ బండ రామవరం, వీరిద్దరూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ ఇద్దరినీ సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.



Next Story

Most Viewed